West Bengal BJP Government: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మే 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రకటించారు. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీకి పార్టీ అధ్యక్షుడితో సహా కీలక నేతలు సువేందు, తదితరులు ఢిల్లీకి బయలుదేరనున్నారు.
Also Read: https://teluguprabha.net/sports-news/interesting-comments-by-indian-cricketer-kl-rahul/
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా మే 9న బెంగాల్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ ఆర్.ఎన్. రవితో చర్చలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
సోమవారం విడుదలైన బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 206 స్థానాలను గెలుచుకుని మెజారిటీ సాధించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 81 స్థానాలకు పరిమితమైంది. ఇక్కడ దశాబ్ద కాలం పాటు సాగిన తృణమూల్ పాలన ముగిసి, తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది.

