ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో మౌని అమావాస్య (Mauni Amavasya) భయం వెంటాడుతోంది. తాజాగా ప్రయాగ్రాజ్ (Prayagraj) మహా కుంభమేళా(Kumbh Mela) లో తొక్కిసలాటలో దాదాపు 20 మంది మృతి చెందగా.. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. అయితే ప్రయాగ్రాజ్లో మౌని అమావాస్య నాడు ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు.. 70 సంవత్సరాల క్రితం కూడా.. మౌని అమావాస్య రోజున జరిగిన కుంభమేళాలో దాదాపు 800 మంది మరణించారు.
స్వాతంత్య్రం వచ్చినాక జరిగిన మొదటి కుంభమేళాలో ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ఫిబ్రవరి 3, 1954న ప్రయాగ్రాజ్ కుంభమేళాకు మౌని అమావాస్య సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆ సమయంలో ఫిబ్రవరి 2, 3వ తేదీ మధ్య రాత్రి గంగానదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిందని ప్రచారం జరిగిందంట.. అదే సమయంలో ఒడ్డున ఉన్న సాధువులు, ఋషుల ఆశ్రమానికి నీరు చేరడం ప్రారంభమైందని చెప్పారు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పుణ్య స్నానాలు చేసిన భక్తులు పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ ఘటనలో దాదాపు 800 మంది భక్తులు మరణించారు. ఆ కుంభమేళాకు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ సంవత్సరం దాదాపు 50 లక్షల మంది భక్తులు జాతరలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే మొదటి కుంభమేళా కూడా. దీని కారణంగా కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అయితే కొందరు మరో కారణం చెబుతారు. పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శన, రద్దీ నియంత్రణ చర్యల వైఫల్యం, పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు హాజరు కావడమే తొక్కిసలాటకు దారితీసిందని అంటారు. ఈ ఘటనలో 800 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. అదే సమయంలో కనీసం 350 నీటిలో గల్లంతు అయ్యారని. 200 మంది తప్పిపోయారని, 2 వేల మంది గాయపడ్డారని పలు పత్రికలు నివేదించాయి.
1954 కుంభమేళాలో అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా పాల్గొన్నారు. నెహ్రూ అమావాస్యకు ఒకరోజు ముందు వచ్చి సంగమంలో స్నానం కూడా చేశారని చెబుతారు. ప్రమాదం తర్వాత నెహ్రూ జస్టిస్ కమలాకాంత్ వర్మ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదం తర్వాత ఈ వేడుకకు వెళ్లవద్దని నాయకులు, వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. 1954 ఘటన తర్వాత కూడా మరికొన్ని తొక్కిసలాటలు జరిగి మరణాలు సంభవించాయి.