Thursday, January 22, 2026
Homeఇంటర్నేషనల్PM Modi: ప్రధాని మోదీ ఫ్రాన్స్‌, అమెరికా పర్యటన షెడ్యూల్‌ ఖరారు

PM Modi: ప్రధాని మోదీ ఫ్రాన్స్‌, అమెరికా పర్యటన షెడ్యూల్‌ ఖరారు

భారత ప్రధాని మోదీ(PM Modi) ఫ్రాన్స్‌, అమెరికా దేశాల పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌(France)లో పర్యటిస్తారని.. ఈ పర్యటన అనంతరం 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ(AI) సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోదీ ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌(Emmanuel Macron)తో కలిసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అలాగే కెడారచీ థర్మో న్యూక్లియర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ రియాక్టర్‌ను మోదీ పరిశీలించనున్నారు.

- Advertisement -

అనంతరం 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్‌ డీసీకి చేరుకోనున్నారు. 13వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)తో భేటీ అవుతారు. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News