Saturday, November 15, 2025
Homeనేషనల్Vice President: ఉప ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే!

Vice President: ఉప ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే!

Vice President Race: దేశ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా రెండేళ్ల పాటు తన పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి తన ఆరోగ్య సమస్యలే కారణమని పలువురు రాజకీయ ప్రముఖులు పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన తన రాజీనామా లేఖ పంపగా, ఆమె వెంటనే ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో అత్యున్నత పదవులలో ఒకటి ఖాళీ కావడంతో, తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే అంశంపై జాతీయ స్థాయిలో చర్చలు ఊపందుకున్నాయి.

- Advertisement -

ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి వివిధ నేతల పేర్లు ఈ దశలో తెరపైకి వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరు అత్యంత ప్రముఖంగా చర్చకు వస్తోంది. ప్రస్తుతం బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఆయనకు కేంద్ర స్థాయిలో పదవిని కల్పించి రాష్ట్రంలో కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలన్నది జేడీయూ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అలాగే, నితీశ్‌ కూడా ఇటీవల కేంద్ర రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది.

ALSO READ: https://teluguprabha.net/national-news/liquor-scam-case-bhupesh-baghels-son-sent-to-14-day-judicial-custody/

ఇక కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ పేరు కూడా ఆసక్తికరంగా వినిపిస్తోంది. ఇటీవల ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల అనుకూలంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై అనేక ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఉపరాష్ట్రపతి పదవికి ఆయనను కూడా పరిశీలనలోకి తీసుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే, జనతాదళ్ (యునైటెడ్) రాజ్యసభ సభ్యుడు మరియు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ అత్యంత అనుభవం ఉన్న, సమతుల్యత కలిగిన నేతను ఈ పదవికి ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ నాయకుడికి చివరకు ఈ కీలక బాధ్యత లభిస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad