Indian Airports on Alert: దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులపై తీవ్ర భద్రతా ముప్పు ఉధృతమవుతున్న తరుణంలో, ఇంటెలిజెన్స్ శాఖలు, సివిల్ ఏవియేషన్ భద్రతా విభాగం హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ ప్రకటించారు.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, విదేశీ తీవ్రవాద గ్రూపులు భారత విమానాశ్రయాలపై దాడులకు యత్నించవచ్చన్న హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్‌పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగుళూర్, అహ్మదాబాద్ వంటి ప్రధాన ఎయిర్‌పోర్టులకు మరింత భద్రతా బలగాలు మోహరించబడ్డాయి.
Read more: https://teluguprabha.net/national-news/kharge-questions-rajya-sabha-chair-amit-shah/
భద్రతా విభాగం బీసీఏఎస్ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్ 22, 2025 నుంచి అక్టోబర్ 2, 2025 వరకు అన్ని విమానాశ్రయాలలో కఠిన భద్రతా చర్యలు అమలులో ఉండనున్నాయి. రన్‌వేలు, హెలీప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లలో భద్రత పెంచాలని సూచించింది. ఈ సమయంలో ప్రయాణికుల స్క్రీనింగ్ మరింత కఠినంగా నిర్వహించబడుతుంది. బ్యాగేజీ తనిఖీలు అధిక శాతం చేయబడతాయి. సున్నితమైన ప్రదేశాలలో మరియు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెరుగుతుంది.
ఇటీవల అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ లో వరుసగా మూడు సార్లు బాంబు ముప్పు హెచ్చరికలు వచ్చాయి. ఇవన్నీ తరువాత హూమోక్స్ గా తేలినా, భద్రతా విభాగాలు అలర్ట్ గానే ఉన్నాయి.
Read more: https://teluguprabha.net/national-news/large-amount-credited-to-dead-mothers-account/
భద్రత చర్యల దృష్ట్యా, ప్రయాణికులు సూచనలు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. విమానం ప్రారంభానికి కనీసం 3 గంటల ముందు ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఎటువంటి చట్టవిరుద్ధమైన వస్తువులు తమ వెంట ఉండకూడదు. అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే సీఐఎస్ఎఫ్ లేదా ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా భద్రతా తనిఖీలకు సహకరించాలి అని తెలిపారు. విమానయాన ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.


