Jallikattu: తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టు వేడుకల్లో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్ఘటనలో ముగ్గురు మరణించగా, 76 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. జల్లికట్టు పోటీల సందర్భంగా ఎద్దులు ఒక్కసారిగా గుంపులోకి దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
శివగంగై జిల్లా సింగంపువారి పల్లి సమీపంలో నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్సాహభరితంగా సాగుతున్న పోటీల్లో అదుపు తప్పిన ఎద్దులు ప్రేక్షకులపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం తలెత్తింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 76 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Also Read: https://teluguprabha.net/top-stories/four-women-missing-from-the-same-family-in-sathya-sai-district/
గత నెలలోనూ తిరుచ్చిలో జరిగిన జల్లికట్టులో 17 ఏళ్ల బాలుడు మరణించాడు. దిండుగల్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా.. 26 మంది గాయపడ్డారు. తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు పోటీల్లో పోలీసులు భద్రతా పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు తలెత్తడం స్థానికుల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి.

