Homeనేషనల్NEET : నీట్‌పై నిరసన.... కేంద్రం వైఖరిపై విరుచుకుపడ్డ టీవీకే అధినేత విజయ్

NEET : నీట్‌పై నిరసన…. కేంద్రం వైఖరిపై విరుచుకుపడ్డ టీవీకే అధినేత విజయ్

NEET Exam Abolition Demand:  దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల కళ్లకు గంతలు కడుతూ, భావి భారత వైద్యుల కష్టాన్ని నీటిపాలు చేస్తున్న ‘నీట్ (NEET)’ పేపర్ లీకేజీ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్ వీధుల నుంచి క్షేత్రస్థాయి వరకు కార్చిచ్చులా రగులుతోంది! జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ అక్రమాలపై దేశ రాజధాని దిల్లీలో విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు గళమెత్తుతుంటే.. కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాల్సింది పోయి అణచివేత ధోరణి ప్రదర్శిస్తుండటం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. 

- Advertisement -

ఈ నేపథ్యంలోనే తమిళగా వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కేంద్రంపై నేరుగా సమర శంఖం పూరించారు. “వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు.. నీట్‌ను పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారం!” అని ఆయన చేసిన సంచలన ప్రకటన దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతల అరెస్టును ఖండిస్తూ ఆయన లేవనెత్తిన ప్రశ్నలు రాజ్యాంగబద్ధమైన హక్కుల రక్షణపై సరికొత్త చర్చకు బాటలు వేశాయి. అసలు నీట్ విధానం వల్ల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయమేంటి? విద్యను తిరిగి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావడం వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? విజయ్ ప్రతిపాదించిన తాత్కాలిక, శాశ్వత పరిష్కారాలు ఎంతవరకు సాధ్యం? 

దిల్లీ ఆందోళనలకు మద్దతు – ప్రజాస్వామ్య సూత్రాలపై దాడికి ఖండన: నీట్ పేపర్ లీక్ అక్రమాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నాయకులు దిల్లీ వేదికగా చేపట్టిన నిరసనలకు విజయ్ తన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ప్రజాప్రతినిధులను కస్టడీలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేయడం “చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు” అవుతుందని, విద్యార్థుల మనోభావాలను తక్షణమే గౌరవించాలని డిమాండ్ చేశారు.

నీట్ రద్దుతోనే శాశ్వత శ్రేయస్సు – విద్యావ్యవస్థలో మార్పు అవసరం: నీట్ పరీక్ష కేవలం ఒక ప్రవేశ పరీక్ష మాత్రమే కాదని, అది నిరుపేద, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కలలను కల్లలు చేసే విధంగా తయారైందని విజయ్ విమర్శించారు. పదే పదే బయటపడుతున్న పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీసులు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (NTA) విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. కోచింగ్ సెంటర్లకు వేల రూపాయిలు సమర్పించుకోలేని పేద విద్యార్థులకు నీట్ తీవ్ర అన్యాయం చేస్తోందని, అందువల్ల ఈ విధానాన్ని పూర్తిగా స్వస్తి చెప్పి, ప్లస్-2 (12వ తరగతి) మార్కుల ఆధారంగానే వైద్య సీట్ల భర్తీ చేపట్టాలని ప్రతిపాదించారు.

రాజ్యాంగ పరిస్ష్కారం : విద్యను మళ్లీ ‘రాష్ట్ర జాబితా’లోకి చేర్చాలి: 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ‘ఉమ్మడి జాబితాలోకి మార్చడం వల్లే కేంద్రం గుత్తాధిపత్యం పెరిగిందని విజయ్ విశ్లేషించారు. వైద్య విద్యను తిరిగి రాష్ట్ర జాబితాలో చేర్చడమే ఈ సమస్యకు ఏకైక, శాశ్వత పరిష్కారమని వెల్లడించారు.

శాశ్వత పరిష్కారం: విద్యపై సంపూర్ణ అధికారాలు రాష్ట్రాలకే ఉండాలి. స్థానిక విద్యా ప్రమాణాలు, అవసరాలకు అనుగుణంగా వైద్య కోర్సుల ప్రవేశ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకోవాలి. విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చడానికి చట్టపరమైన, సాంకేతిక అడ్డంకులు ఉంటే, తాత్కాలికంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాని రూపొందించి, రాష్ట్రాలకు తక్షణ నిర్ణయాధికారం కల్పించాలని కేంద్రానికి సూచించారు.

ఓటు బ్యాంకు రాజకీయం కాదు – విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం: తమిళనాడు రాజకీయాల్లో నీట్ రద్దు హామీలు ఇచ్చి ఓట్లు దండుకునే “కపట రాజకీయాలకు” తమ పార్టీ దూరంగా ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. నీట్ రద్దు అనేది కేవలం ఓట్ల కోసం చేసే రాజకీయ ప్రకటన కాదు, ఇది లక్షలాది మంది విద్యార్థుల, వారి కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన సున్నితమైన అంశమని గుర్తుచేశారు. నీట్ విధానాన్ని తొలగించే వరకు తమ పోరాటం ఆగేది లేదని పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News