Sunday, November 16, 2025
HomeTop StoriesPM Modi: నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

PM Modi: నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

Modi Speech on Historic GST: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.

- Advertisement -

కొత్త శకానికి నాంది: జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త శకానికి నాంది పలికాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ సంస్కరణలు నిజంగానే విప్లవాత్మకమైనవని చెప్పవచ్చు. ఇకపై జీఎస్టీలో నాలుగు స్లాబ్‌లకు బదులు కేవలం రెండే స్లాబ్‌లు (5 శాతం, 18 శాతం) కొనసాగనున్నాయి. విలాసవంతమైన వస్తువులపై మాత్రం 40 శాతం పన్ను విధించనున్నారు. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. దీని ప్రకారం 12%, 28% పన్ను శ్లాబులు ఇక ఉండవు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నిర్ణయాలను ప్రకటిస్తూ.. ఇవి నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు నాంది అని పేర్కొన్నారు. రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ఈ మార్పులు చేశామని ఆమె వివరించారు. వ్యవసాయం, వైద్య రంగాలకు సంబంధించిన ఉత్పత్తులపై పన్నులు తగ్గించడం ద్వారా ఈ రంగాలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad