Viral Video : ఓ చిన్నారి తన తల్లితో కలిసి చదువుకుంటూ పదే పదే ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటీజన్లు మండిపడుతున్నారు. చిన్నారికి చదువు చెప్పే విధానం ఇదేనా అంటూ తిట్టిపోస్తున్నారు.
తల్లి చదువు చెబుతుండగా చిన్నారి భయపడుతూ అంకెలు రాస్తున్న వీడియోను మినీ చందన్ ద్వివేది అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 1 నుంచి 10 అంకెలు రాసేటప్పుడు చిన్నారి ఏడుస్తూనే ఉన్నాడు. ఎక్కడ తల్లి కొడుతుందో అన్న భయం అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ సందర్భంలో నన్ను కొడతావా అంటూ అతడు తన తల్లిని అడుగుతాడు. అమ్మ కోపాన్ని పోగొట్టేందుకు ఆమెకు ముద్దు కూడా ఇస్తాడు. వీడియో ఎండ్‌లో ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ తల్లి అతడిని అడుగుతుంది. అతడి కన్నీటిని తుడుస్తుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరు మిలియన్లకు పైగా మంది దీనిని చూశారు. చాలా మంది నెటీజన్లు ఈ వీడియోపై మండిపడుతున్నారు. బిడ్డను భయపెట్టి చదివిస్తున్నందుకు ఆమెను తిట్టిపోస్తున్నారు. చదువు చెప్పే విధానం ఇది కాదంటూ మండిపడుతున్నారు.