HomeTop StoriesTamilnadu Elections: తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయం.. విజయ్‌ ప్లాన్స్‌ ఇవే.!

Tamilnadu Elections: తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయం.. విజయ్‌ ప్లాన్స్‌ ఇవే.!

Tamilnadu Elections TVK Vijay: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందే ఆ రాష్ట్రంలో రిసార్ట్‌ రాజకీయం మొదలైంది. ఈ క్రమంలో తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత విజయ్ ముందు చూపు ప్రదర్శఇంచారు. తన అభ్యర్థుల కోసం రిసార్ట్ బుక్‌ చేశారు. కాగా తమిళనాడులో హంగ్‌ వచ్చే అవకాశం ఉందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో.. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు చేజారిపోకుండా విజయ్‌ అప్రమత్తం అయ్యారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/couple-commits-huge-fraud-in-the-name-of-chit-fund-up-to-rs-2-crores-collected/

మహాబలిపురం సమీపంలోని పుంజేరి వద్ద ఒక విలాసవంతమైన రిసార్ట్‌ను టీవీకే బుక్ చేసింది. ఈ రిసార్ట్‌లో 100 మందికి పైగా బస చేసే సదుపాయం ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులెవరూ ఎక్కడికీ వెళ్లకుండా, నేరుగా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి లేదా కేటాయించిన రిసార్ట్‌కు చేరుకోవాలని విజయ్ ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేశారు.

Also Read: https://teluguprabha.net/telangana/thieves-gun-fire-at-pmj-jewellery-store-in-karimnagar/

అదేవిధంగా కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మరోవైపు పార్టీ లీగల్ టీమ్‌ను కూడా విజయ్ అప్రమత్తం చేశారు. తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో, విజయ్ నేతృత్వంలోని టీవీకే కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉండటంతో ఈ రిసార్ట్ రాజకీయాలకు దారితీశాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News