Monday, July 14, 2025
Homeనేషనల్VIJAY: పోలీసు కస్టడీలో మరణించిన బాధితుడి కుటుంబానికి విజయ్ పరామర్శ

VIJAY: పోలీసు కస్టడీలో మరణించిన బాధితుడి కుటుంబానికి విజయ్ పరామర్శ

ACTOR VIJAY: తమిళనాడు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన స్టార్ హీరో విజయ్ దళపతి వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈమేరకు తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టిన విజయ్.. ఇప్పటికే ప్రజాసమస్యలపై తన గళం బలంగా విప్పుతున్నారు. సినిమాల్లో తిరుగులేని విజయాలు అందుకున్న ఆయన.. రాజకీయాల్లోనూ విజయం అందుకోవాలని భావిస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తమిళనాడులోని శివగంగలో పోలీసు కస్టడీలో మరణించిన బాధితుడు అజిత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు.

- Advertisement -

తిరుభువనంలోని బాధితుడి నివాసానికి వెళ్లిన విజయ్ మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి రూ.2లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ అవమానవీయంగా, క్రూరంగా పనిచేస్తుందంటూ విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా శివగంగ పోలీసు స్టేషన్‌లో ఓ కేసు విషయమై కస్టడీలో ఉన్న అజిత్ కుమార్ అనే 27 ఏళ్ల యువకుడు మరణించాడు. పోలీసులు టార్చర్ పెట్టడంతోనే యువకుడు మరణించాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. మృతుడి కుటుంబానికి రూ.5లక్షలు సాయంతో పాటు అజిత్ సోదరుడికి టెక్నీషియన్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అలాగే మూడు సెంట్ల భూమి కూడా రాసిచ్చింది. సీఎం స్టాలిన్ బాధిత కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ప్రతిపక్ష నేత పళనిస్వామి కూడా ఫోన్‌లోనే పరామర్శించి ఐర్యం చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. మొత్తం ఐదురుగు పోలీసులను నిందింతులుగా చేర్చి కేసు నమోదుచేశారు.

ఇదిలా ఉంటే విజయ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం జన నాయగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వవ వహిస్తున్న ఈ సినిమాలో పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా మూవీ విడుదల కానుంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇదే తన చివరి చిత్రమని ప్రచారం జరుగుతుంది. కాగా గతేడాది తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టారు. ఎంజీఆర్ లాగా ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమని విజయ్ వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News