HomeTop StoriesTVK Vijay: గవర్నర్‌ని కలిసిన విజయ్‌.. మ్యాజిక్‌ ఫిగర్‌తోనే రావాలని లోక్‌ భవన్‌ స్పష్టం

TVK Vijay: గవర్నర్‌ని కలిసిన విజయ్‌.. మ్యాజిక్‌ ఫిగర్‌తోనే రావాలని లోక్‌ భవన్‌ స్పష్టం

TVK Vijay- Governor: తమిళనాడు రాజకీయ పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ కలిగిస్తున్నాయి. టీవీకే అధినేత విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా సందిగ్ధత నెలకొంది. విజయ్‌ మ్యాజిక్‌ ఫిగర్‌(118)కి కాస్త దూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మరోసారి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను విజయ్‌ మరోసారి కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కలిశారు. దీనిపై లోక్‌భవన్ ఈ రోజు కీలక ప్రకటన చేసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/big-shock-for-varma-high-command-relieves-him-of-pithapuram-in-charge/

‘ఈ రోజు గవర్నర్‌ ఆర్లోకర్‌తో టీవీకే అధినేత విజయ్‌ భేటీ అయ్యారు. మెజారిటీ కనిపించడం లేదని వివరించారు. మెజారిటీపై TVK పూర్తి వివరాలు ఇవ్వలేదు. పూర్తి మెజారిటీతోనే రావాలని గవర్నర్‌ సూచించారు.. అని లోక్‌ భవన్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరే ఇతర పార్టీని ఆహ్వానించబోమని విజయ్‌కి గవర్నర్‌ హామీ ఇచ్చినట్లు తెలిస్తోంది. 

Also Read: https://teluguprabha.net/telangana/heavy-rains-likely-in-several-districts-soon/

మరోవైపు టీవీకేతో కలిసి వెళ్తామని డీఎంకే కూటమి పార్టీలు వీసేకే, సీపీఐ, సీపీఎం.. ఎంకే స్టాలిన్‌కు వివరించారు. ఆయన వారి ఇష్టానికే నిర్ణయాన్ని వదిలేసినట్లు సమాచారం. దీంతో ఆయా పార్టీలు విజయ్‌కి ఈరోజు సాయంత్రంలోగా మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News