Sunday, February 8, 2026
Homeనేషనల్TVK Vijay: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. సీబీఐ విచారణకు ఢిల్లీకి విజయ్‌

TVK Vijay: కరూర్‌ తొక్కిసలాట ఘటన.. సీబీఐ విచారణకు ఢిల్లీకి విజయ్‌

TVK Vijay In Delhi for CBI Inquiry: కరూర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ కేసు విచారణలో పాల్గొనేందుకు టీవీకే అధినేత విజయ్‌ ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు. రెండో విడత సీబీఐ విచారణకు ఆయన సోమవారం హాజరుకానున్నారు.

- Advertisement -

గతేడాదితో సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్‌ నిర్వహించిన బహిరంగ సభలో భారీ తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించారు. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా, ఇప్పటికే ఒకసారి జనవరి 12న విజయ్‌ సీబీఐ ఎదుట విచారణకు హాజరు కాగా.. మరోసారి విచారణకు సహకరించాల్సిందని ఆయనకు సమన్లు పంపించారు.

Also Read: https://teluguprabha.net/national-news/rahul-gandhi-mgnrega-protest-rae-bareli/

ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలో సీబీఐ ఎదుట రెండో విడత విచారణకు విజయ్‌ హాజరుకానున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.

జనవరి 12న జరిగిన విచారణలో విజయ్‌ దాదాపు 6 గంటల పాటు విచారణకు హాజరు కాగా.. సంక్రాంతి పండుగ కారణంగా తదుపరి విచారణకు సమయం కోరారు. దీంతో సీబీఐ ఇప్పుడు మళ్లీ సమన్లు జారీ చేసింది.

Also Read: https://teluguprabha.net/national-news/pm-modi-bengal-visit-development-projects-amrit-bharat-trains/

కాగా, త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ ఇప్పటికే తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తయారీకి 12 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. అదేవిధంగా ప్రచార కార్యకలాపాల కోసం 10 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News