HomeTop StoriesTVK Vijay: 'తమిళనాడు అభివృద్ధికి సమిష్టి సహకారం అవసరం'

TVK Vijay: ‘తమిళనాడు అభివృద్ధికి సమిష్టి సహకారం అవసరం’

TVK Vijay Thanks to PM Modi: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు గాను తనను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ,  ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి టీవీకే చీఫ్‌ విజయ్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవలో ఉత్తమ ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/vijay-unanimously-elected-as-tvk-legislature-party-leader/

తమిళనాడు అభివృద్ధికి సమిష్టి సహకారం అవసరమని విజయ్‌ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసంక్షేమమే లక్ష్యమని స్పష్టం చేసిన విజయ్‌.. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి,  ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసేవలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తామని, పారదర్శకమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీల సహకారం కీలకమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Also Read: https://teluguprabha.net/national-news/the-bjp-government-will-be-formed-in-west-bengal-on-may-9th/

తాజా ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ (118) కంటే పార్టీకి 10 సీట్లు తక్కువగా ఉండటంతో, కాంగ్రెస్, సీపీఐ వంటి ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News