Thalapathy Vijay TVK CM Candidate Analysis: వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని టీవీకే పార్టీ ప్రకటించింది. పార్టీ స్థాపకులు ‘దళపతి’ విజయ్‌ని తమ సీఎం అభ్యర్థిగా పేర్కొన్నాయి. ఇది తమిళనాడులో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. ఓ వైపు అధికార డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ ఇలా ప్రతీ పార్టీకి ఈ ఎన్నిక కత్తిమీద సామే అని చెప్పాలి. ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల సరళి తదితర అంశాలపై సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రానున్న ఎలక్షన్స్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది.
తీర్మానానికి ఆమోదం: టీవీకే పార్టీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించి మరో అడుగు ముందుకు వేసినట్లే తెలుస్తోంది. తమిళగ వెట్రి కళగం పార్టీ (టీవీకే) అధికారికంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించింది. ఇందులో టీవీకే ముఖ్య నాయకత్వం, విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు వి.వి.ఎస్. ధనశేఖర్ మీడియాకు వెల్లడించారు.
పార్టీని స్థాపించనప్పటీ నుంచి విజయ్ రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టారని టీవీకే నాయకులు తెలిపారు. ఇందుకోసం సినిమాలకు సైతం ఆయన దూరంగా ఉన్నారన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన తనలో ఉందని పని చేయాలనే సంకల్పంతో ఉన్నారని నేతలు తెలిపారు. తమిళనాడు మేలు కోరే విజయ్ వెంటే మేమంతా ఉంటామని స్పష్టం చేశారు. మంచి ఫ్యాన్ బేస్, సౌమ్యుడిగా పేరు ఉండటంతో విజయ్‌కి కలిసివస్తుందని భావిస్తున్నారు.
విజయ్ రాజకీయాల్లో రాణించేనా?: విజయ్ గత కొంత కాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విద్య, ఆరోగ్యం రంగాల్లో సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు యువతలో మంచి క్రేజ్ ఉంది. సామాజిక కార్యక్రమాలతో పాటు నిరుపేదలకు టీవీకే తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే విజయ్ ఏ మేరకు రాజకీయాల్లో రాణిస్తారో చూడాలి.
పొలిటికల్ కేడర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్వయంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో కేడర్ అంతా సంబురాల్లో మునిగి తేలుతోంది. అయితే రూట్ లెవల్ విజయ్ పార్టీ చెప్పుకోదగ్గ కేడర్ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాభావం తప్పదని అంటున్నారు. అటు అధికార డీఎంకే అన్ని సర్వేల్లోనూ దూసుకెళ్తోంది. దీనికి తోడు ఇతర పార్టీలకు సైతం సొంత కేడర్ అలానే ఉంది. గ్రామ స్థాయిలో కేడర్ ఆశించిన స్థాయిలో ఓట్లను రాబట్టకుంటే టీవీకే పార్టీ ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం.