TVK Vijay Tweet on Inter Results: తమిళనాడు రాజకీయం ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతూ మండుటెండలో మరింత అగ్గి రాజేస్తోంది. విజయ్ సీఎం అవుతారా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే దానిపైనే అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే విజయ్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఓవైపు తమిళనాడు పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతుండగా.. ఇవాళ తమిళనాడులో 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు కొద్దీసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 95.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను అభినందిస్తూ, పరీక్షల్లో వెనుకబడిన వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విజయ్ హృదయపూర్వకంగా అభినందించారు. “పట్టుదలతో శ్రమించి పరీక్షల్లో విజయం సాధించిన నా ప్రియమైన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు నా అభినందనలు. ఈ విజయం మీ కష్టానికి దక్కిన అసలైన గుర్తింపు. ఇదే ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువుల వైపు మీ తదుపరి అడుగులు వేయండి” అని విజయ్ పిలుపునిచ్చారు.
பன்னிரண்டாம் வகுப்புப் பொதுத் தேர்வில், விடாமுயற்சியால் வெற்றிக் கனியைச் சுவைத்த என் அன்புத் தம்பி, தங்கைகளுக்கு நெஞ்சார்ந்த வாழ்த்துகள்!
இந்த வெற்றி, உங்கள் கடின உழைப்பிற்குக் கிடைத்த அங்கீகாரம். உயர்கல்வி எனும் அடுத்த கட்டத்தை நோக்கி, நம்பிக்கையுடன் அடி எடுத்து வையுங்கள். அதே…
— TVK Vijay (@TVKVijayHQ) May 8, 2026
Also Read: https://twitter.com/TVKVijayHQ/status/2052652213735157838
విజయానికి అత్యంత సమీపంలోనే ఉన్నాం..
చాలా మంది విద్యార్థులు ఆశించిన ఫలితాలు రాకుంటే తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. ఫెయిలైన వారిలో, తక్కువ మార్కులు వచ్చిన వారిలో ధైర్యం నింపేలా విజయ్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. “ఒకవేళ ఈసారి విజయం సాధించలేకపోయినా ఎవరూ అధైర్యపడకండి. మళ్లీ ప్రయత్నించండి. గుర్తుంచుకోండి.. మనం విజయానికి అత్యంత సమీపంలోనే ఉన్నాం. మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించాలి. మంచే జరుగుతుంది.. విజయం నిశ్చయం!” అంటూ విద్యార్థులకు ఆయన భరోసా ఇచ్చారు. అయితే, తన పరోక్షంగా తామే అధికారం చేపట్టబోతున్నాం. విజయం నిశ్చయం అనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిలు (97% ఉత్తీర్ణత) అబ్బాయిల కంటే (93.19% ఉత్తీర్ణత) మెరుగైన ఫలితాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోడ్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

