Vijay- Sangeetha Divorce: తమిళ స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విజయ్‌పై నమ్మకద్రోహం ఆరోపణలతో ఆయన భార్య సంగీత ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. మరో నటితో విజయ్‌కి సంబంధం ఉందంటూ ఆమె ఆరోపించారు. ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలంటూ విజయ్‌కు నోటీసులు పంపించింది.
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమిళ సినీ సూపర్ స్టార్ దళపతి విజయ్.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత.. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితంలో ఊహించని షాక్ తగిలింది. తమ 25 ఏళ్ల వైవావిక బంధానికి ముగింపు పలకాలని కోరుతూ విజయ్ భార్య సంగీత.. చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Also Read: https://teluguprabha.net/telangana/ex-mlc-kavitha-comments-on-ktr-regarding-delhi-liquor-scam-case/
మరో సినీ నటితో తన భర్తకి సంబంధం ఉందంటూ.. నమ్మకద్రోహం ఆరోపణలతో సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 2021లో తాను ఈ విషయాన్ని గుర్తించానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వార్త తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. విడాకుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఫ్యామిలీ కోర్టు.. ఈ మేరకు విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 20న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
కాగా, 1999 ఆగస్టులో విజయ్, సంగీత వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత జరిగిన కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ఆయన భార్య కనిపించకపోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయింది.
మరోవైపు ఇటీవల తమిళనాడు బీజేపీ నేత నయనార్ నాగేంద్రన్ సైతం.. విజయ్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నటి త్రిషతో బంధం నుంచి ఆయన బయటకు వస్తేనే రాజకీయాలు అర్థమవుతాయని కామెంట్స్ చేయడం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై త్రిష ఫైర్ అవ్వగా.. నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. అయితే విడాకుల వ్యవహారంపై విజయ్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

