ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో తొక్కిసలాట(Maha Kumbh Mela Stampede) జరగడం బాధాకరమని ప్రధాని మోదీ(PM Modi) ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.
“కుంభమేళాలో తొక్కిసలాట జరగడం అత్యంత బాధాకరం. ఈ తొక్కిసలాటలో ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. బాధితులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో నిరంతరం మాట్లాడుతున్నా. అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నా” అని మోదీ తెలిపారు.
కాగా మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి.