Homeనేషనల్Twisha Sharma Case: న్యాయస్థానంపై నిందలా? 'ట్విషా శర్మ' కేసులో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. దర్యాప్తు...

Twisha Sharma Case: న్యాయస్థానంపై నిందలా? ‘ట్విషా శర్మ’ కేసులో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. దర్యాప్తు సీబీఐకి అప్పగింత!

Twisha Sharma case Supreme Court CBI probe : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది. వివాహమైన ఐదు నెలలకే ఓ అత్తారింట్లో చిగురుటాకులా రాలిపోయిన ఈ యువతి మరణం వెనుక ఉన్న అసలు నిజా నిజాలను వెలికితీసేందుకు అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. నిందితులకు అండగా న్యాయవ్యవస్థ నిలుస్తోందంటూ సాగుతున్న దుష్ప్రచారంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. 

- Advertisement -

నిందలు వేయడం దురదృష్టకరం.. సుప్రీంకోర్టు ఆవేదన : నటి ట్విషా శర్మ మృతి కేసును సుమోటోగా స్వీకరించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టుపై వస్తున్న కొన్ని కథనాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడి తల్లి (మృతురాలి అత్త) ఒక మాజీ న్యాయమూర్తి అయినంత మాత్రాన, న్యాయవ్యవస్థే నిందితులను రక్షిస్తోందనడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. ఇటువంటి నిరాధార ప్రచారాలు తమను ఎంతగానో బాధించాయని, నిష్పక్షపాత విచారణ జరిపించేందుకే తాము ఈ కేసును దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ (CBI) కి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-mandates-free-sanitary-napkins-separate-toilets-girls-schools-rte-article-21/

మీడియా ట్రయల్” వద్దు.. లక్ష్మణ రేఖ దాటొద్దు : ఈ కేసు దర్యాప్తు పురోగతిలో మీడియా జోక్యమే కారణమన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను ధర్మాసనం పూర్తిగా తోసిపుచ్చింది. విచారణ జరుగుతున్న తరుణంలో మీడియా అత్యంత సంయమనం పాటించాలని ఆదేశించింది.

ముందస్తు కథనాలు వద్దు: కేసులో నేరం ఇంకా నిరూపణ కాకముందే ఊహాజనిత కథనాలతో సమాజంలో అంచనాలు పెంచవద్దని స్పష్టం చేసింది.

ప్రకటనల నిషేధం: బాధితురాలి తరఫు వారు కానీ, నిందితుల కుటుంబ సభ్యులు కానీ మీడియా ముందుకు వచ్చి బహిరంగ ప్రకటనలు చేయవద్దని, కేవలం దర్యాప్తు సంస్థల ముందే తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది.

సాక్షుల రక్షణ: భవిష్యత్తులో కోర్టులో కీలక సాక్షులుగా మారే అవకాశం ఉన్న వ్యక్తుల వద్దకు మీడియా వెళ్లి ముందే వారి సాక్ష్యాలను రికార్డ్ చేయడం వల్ల అసలు విచారణ ప్రతికూల ప్రభావానికి గురవుతుందని హెచ్చరించింది.

ట్విషా శర్మ కేసు – ఇప్పటివరకు జరిగిన పరిణామలు 
అనుమానాస్పద మృతి : మే 2026 ప్రారంభంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న అత్తింట్లో వివాహమైన ఐదు నెలలకే నటి ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Also Read: https://teluguprabha.net/telangana/16th-finance-commission-funds-telangana-rural-development/

సందేశాలు బహిర్గతం : మే మధ్య వారం, తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభ, వరకట్న వేధింపుల గురించి మరణానికి ముందు తల్లి, స్నేహితురాలికి ట్విషా పంపిన వాట్సాప్ సందేశాలు వెలుగులోకి వచ్చాయి.

హైకోర్టు ఆదేశం
మే 23, 2026, మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపణల నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్-భోపాల్ బృందం ట్విషా మృతదేహానికి రెండోసారి శవపరీక్ష (Post-Mortem) నిర్వహించింది.

సుప్రీంకోర్టు జోక్యం – సీబీఐకి కేసు
మే 25, 2026, కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తల్లిదండ్రులకు ఇదొక సందేశం: సొలిసిటర్ జనరల్ : మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతం ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు ఒక కనువిప్పు లాంటిదన్నారు. వివాహ బంధంలో ఇరుక్కుపోయి నరకం అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోవడం కంటే, ఆ కుమార్తెకు విడాకులు ఇప్పించి ఇంటికి తెచ్చుకోవడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు.

రంగంలోకి దిగిన సీబీఐ మెరుపు దళం : సుప్రీంకోర్టు ఆదేశాల వెలువడిన వెంటనే సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక అధికారుల బృందం ఇప్పటికే దిల్లీ నుంచి భోపాల్‌కు చేరుకుంది. స్థానిక పోలీసుల నుంచి కేసు డైరీ, లభ్యమైన పత్రాలు, ట్విషా శర్మ చివరి నిమిషంలో పంపిన మొబైల్ సందేశాల డేటాను సీబీఐ స్వాధీనం చేసుకోనుంది. ఎయిమ్స్-భోపాల్ వైద్యుల బృందం ఆదివారం నిర్వహించిన రెండో పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా శాస్త్రీయ కోణంలో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లనున్నారు. దర్యాప్తు సంస్థలపై ప్రజలు నమ్మకం ఉంచాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అత్యున్నత న్యాయస్థానం భరోసా ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News