HomeTop StoriesPulitzer Award: ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్‌ అవార్డు

Pulitzer Award: ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్‌ అవార్డు

Pulitzer Award for Two Indian Journalists: ప్రపంచవ్యాప్తంగా జర్నలిజం రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే పులిట్జర్‌ అవార్డు 2026 కు గాను ఇద్దరు భారతీయ జర్నలిస్టులు ఎంపికయ్యారు. డిజిటల్‌ నిఘా, సైబర్‌ మోసాలను వెలుగులోకి తెచ్చినందుకు గాను ఆనంద్ ఆర్‌కే, సుపర్ణా శర్మను ఈ పురస్కారం వరించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/vijay-unanimously-elected-as-tvk-legislature-party-leader/

ఆనంద్‌ ఆర్‌కే, సుపర్ణా శర్మ.. “ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ” విభాగంలో పులిట్జర్‌ అవార్డును గెలుచుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ పత్రికలో ప్రచురితమైన “trAPPed” అనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ కోసం వీరిని ఈ అవార్డు వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలతో పాటు దేశంలో జరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లను ఈ కథనం వెలుగులోకి తెచ్చింది. వీరితో పాటు బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్ కూడా ఈ పురస్కారాన్ని పంచుకున్నారు. 

Also Read: https://teluguprabha.net/national-news/vijay-unanimously-elected-as-tvk-legislature-party-leader/

వీరితో పాటు, ‘ఇంటర్నేషనల్ రిపోర్టింగ్’ విభాగంలో అసోసియేటెడ్ ప్రెస్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న మరో భారతీయ జర్నలిస్ట్ అనిరుద్ధ ఘోషల్ కూడా పులిట్జర్ అవార్డును అందుకున్న జట్టులో ఉన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News