Two Indians die on Everest: ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరంపై తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పర్వతారోహణ ముగించుకొని శిఖరంపై నుంచి కిందికి దిగుతుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు నేపాల్ అధికారులు వెల్లడించారు. మృతులను భారత్‌కు చెందిన అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా అధికారులు గుర్తించారు. వారు కిందకు దిగుతున్న సమయంలో తీవ్రంగా అలసిపోయారని.. రక్షించేందుకు గైడ్స్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 274 మంది పర్వతారోహుల్లో సందీప్ ఆరే సహా తులసి రెడ్డి పాల్పునూరి, అజయ్ పాల్ సింగ్ అనే మరో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన బృందంగా వీరు ఒక కొత్త రికార్డు నెలకొల్పారు. అయితే, పర్వతం దిగుతున్న సమయంలో సందీప్ ఆరే మృతి చెందారు. గురువారం సాయంత్రం మరో బృందం పర్వత శిఖరాన్ని చేరుకొని తిరిగి వస్తుండగా అరుణ్ కుమార్ తివారీ కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో వారి స్వస్థలాల్లో విషాదం నెలకొంది.
Also read: Donald Trump: ఆ పెళ్లికి వెళ్తే నన్ను చంపేస్తారు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

