Homeనేషనల్Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం

Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం

Two Planes Collide: దేశ రాజధానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఆకాశ విమానాన్ని స్పైస్‌జెట్‌ ఢీకొట్టింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. అయితే ఇరు విమానాల రెక్కలు విరిగాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/telangana-leaders-angered-by-mp-tejasvi-suryas-comments/

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం ఒక ప్రమాదం తప్పింది. రన్‌వేపై ట్యాక్సీ చేస్తున్న సమయంలో ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్ సంస్థలకు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన ఆకాశ ఎయిర్ విమానం, లేహ్ నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానం ఒకదానికొకటి తాకాయి.

Also Read: https://teluguprabha.net/cinema-news/samantha-maa-inti-bangaram-movie-first-song-out/

ఆకాశ ఎయిర్ విమానం పార్కింగ్ బే నుంచి వెనక్కి కదులుతున్న సమయంలో, ట్యాక్సీ చేస్తున్న స్పైస్‌జెట్ విమానం రెక్క ఆకాశ ఎయిర్ విమానం తోక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనతో రెండు విమానాల రెక్కల భాగాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు, ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఆకాశ ఎయిర్ విమానంలోని ప్రయాణికులను విమానం నుంచి దించి, హైదరాబాద్ పంపేందుకు సంస్థ వేరొక విమానాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం డీజీసీఏ అధికారులు ఈ ప్రమాదంపై విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News