Sunday, May 18, 2025
Homeనేషనల్MS Students Died : వీకెండ్ పార్టీలో విషాదం..అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

MS Students Died : వీకెండ్ పార్టీలో విషాదం..అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే ప్రమాద వశాత్తు ఇద్దరు తెలంగాణ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ఇద్దరూ స్నేహితులని ఇరు కుటుంబ సభ్యులు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన శివదత్త(25), నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్‌(24) ఉన్నత చదువుల కోసం కొద్ది నెలలక్రితం అమెరికా వెళ్లారు. సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలో ఇద్దరూ ఎంఎస్‌ చదువుతున్నారు. వీకెండ్ సందర్భంగా శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు.

- Advertisement -

అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు అక్కడే ఉన్న సరస్సులోకి దిగారు. బాగా చలిగా ఉండటంతో మిగతా వారంతా సరస్సు నుండి బయటకి వచ్చేయగా.. శివదత్త, ఉత్తేజ్ మాత్రం ఈత కొడుతూ గల్లంతయ్యారు. దాంతో ఒడ్డున ఉన్న వారి స్నేహితులు పెట్రోలింగ్ పోలీసులకు సమాచారమివ్వగా.. వారు శివదత్త మృతదేహాన్ని వెలికితీశారు. ఉత్తేజ్ ఆచూకీ కోసం ఆదివారం రాత్రి వరకూ గాలించగా.. మృతదేహం లభ్యమైంది. ఉన్నతచదువులకై వెళ్లిన తమ కుమారుడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలిసి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లల భౌతికకాయాలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్, సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News