Kerala Assembly election results: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభంజనం సృష్టిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
మార్పు కోరుకున్న కేరళ ప్రజలు: ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హర్షం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ ఫలితాల ద్వారా స్పష్టమైందని అన్నారు. “మేం ఆశించిన దానికంటే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. యూడీఎఫ్ సునాయాసంగా మెజారిటీ సాధిస్తుందనే నమ్మకం ఉంది. రాష్ట్రంలో సానుకూల మార్పు తీసుకురావడమే మా లక్ష్యం” అని థరూర్ పేర్కొన్నారు.
సీఎం రేసుపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు!: సీఎం అభ్యర్థిత్వంపై థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి తగినంత మంది సమర్థులైన నేతలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమవుతారని తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే.. అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని థరూర్ స్పష్టం చేశారు.
మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో ప్రస్తుత గణాంకాల ప్రకారం:
- UDF: 96 స్థానాల్లో ఆధిక్యం
- LDF: 42 స్థానాల్లో ఆధిక్యం
- NDA: 01 స్థానంలో ఆధిక్యం

