Homeనేషనల్Udhayanidhi: వరుస వివాదాల్లో ఉదయనిధి స్టాలిన్‌.. సనాతన ధర్మంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు

Udhayanidhi: వరుస వివాదాల్లో ఉదయనిధి స్టాలిన్‌.. సనాతన ధర్మంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు

Udhayanidhi Stalin Comments about sanathana dharma: తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌ తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వగా హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ ఇవాళ స్పందించారు. కొందరు కావాలనే పనిగట్టుకొని తన మాటలను వక్రీకరిస్తున్నారని తెలిపారు. తన ఉద్దేశం సనాతన ధర్మాన్ని కించపరచడం కాదని, మనుషుల మధ్య అగ్ర, నిమ్న వర్గాలనే విభజనను, కుల వ్యవస్థను, అసమానతలను నిర్మూలించాలనేదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. సనాతన ధర్మం పేరుతో కుల వ్యవస్థను, అంటరానితనాన్ని ప్రోత్సహించే, సమానత్వానికి అడ్డుపడే సామాజిక ఆచారాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. ద్రవిడ సిద్ధాంతం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉండాలని, కులం పేరుతో మనుషులను విభజించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/foundation-stone-laid-for-advanced-medium-combat-aircraft-project-in-puttaparthi/

నేను కుల వ్యవస్థకే వ్యతిరేకం.. హిందూ మతానికి కాదు..

సనాతన ధర్మం కారణంగా సమాజంలో జరుగుతున్న వివక్షను మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో పోల్చుతూ, అటువంటి వివక్షను రూపుమాపాలనే అర్థంలో తాను మాట్లాడానని, ఇది హిందూ మతానికి వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. తన “సనాతన నిర్మూలన” వ్యాఖ్యలు కుల వ్యవస్థను అంతం చేసే ఉద్దేశంతో చేసినవే తప్ప, హిందువుల నమ్మకాలను దెబ్బతీయడానికి కాదని, ప్రజలను ఐక్యం చేయడం తన లక్ష్యమని సమర్థించుకున్నారు. మనుషులను అగ్ర, అధమ కులాలుగా విభజించే కుల వ్యవస్థను, సమానత్వాన్ని అడ్డుకునే విధానాలను నిర్మూలించడమే తన ఉద్దేశమని, ఇది మతానికి లేదా పూజా కార్యక్రమాలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తాను హిందూ మతానికి లేదా దేవుని పూజలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. సనాతన నిర్మూలన అంటే ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదని కాదని, సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలని అర్థమని ఆయన వివరణ ఇచ్చారు. పెరియార్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన సూత్రాలనే తాను అసెంబ్లీలో పునరుద్ఘాటించానని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అంటే కుల వివక్షను, సామాజిక అసమానతలను ప్రోత్సహించే విధానాన్ని నిర్మూలించడమేనని స్పష్టం చేశారు. సమాజంలో సమానత్వం, కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం అంబేడ్కర్, పెరియార్ చెప్పిన భావజాలాన్నే తాను అనుసరిస్తున్నట్లు తెలిపారు. కొందరు తన మాటలను వక్రీకరిస్తున్నారని, తాను ఎవరికీ, దేనికీ భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News