2026- 27 Union Budget pre-Budget consultation: 2026- 27 కేంద్ర బడ్జెట్‌కి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ఢిల్లీలో ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల సమావేశం నిర్వహంచారు. ఈ సమావేశంలో ఆర్థిక ప్రాధాన్యతలు, ఆర్థిక సవాళ్లు, విధాన చర్యలు కీలకమైన అంశాలుగా చర్చించారు.
2026–27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు.. దేశ రాజధానిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ‘బడ్జెట్‌కు ముందు సంప్రదింపుల’ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, మణిపూర్ గవర్నర్, ఢిల్లీ, గోవా, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, సిక్కిం ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో ఉన్నారు.
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అభిప్రాయాలు, సూచనలను సేకరించడానికి ప్రభుత్వం నిర్వహించే సంప్రదింపుల ప్రక్రియలో బడ్జెట్‌కు ముందు సమావేశాలు జరుగుతాయి. ఆర్థిక ప్రాధాన్యతలు, ఆర్థిక సవాళ్లు, విధాన చర్యలు కీలకమైన అంశాలుగా చర్చ జరిగిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman chairs the meeting on Pre-Budget Consultation with States and Union Territories (with Legislature) for the forthcoming Union Budget 2026-27, in New Delhi, today.
Along with Union Minister for State for Finance… pic.twitter.com/fcTqVWhMkT
— Ministry of Finance (@FinMinIndia) January 10, 2026
చరిత్ర సృష్టించనున్న నిర్మలా
2026- 27 కేంద్ర బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రిగా చరిత్ర సృష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో అత్యధిక కాలం పనిచేసిన మహిళా క్యాబినెట్ మంత్రిగా కూడా ఆమె రికార్డు క్రియేట్ చేయనున్నారు. అయితే, ఈసారి బడ్జెట్ సమావేశాల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ మరింతగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/deputy-cm-pawan-kalyan-comments/
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయని.. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆదివారం ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు గంటల పాటు ప్రసంగిస్తారని పేర్కొంది.
జనవరి 29న బీటింగ్ రీట్రీట్ వేడుక ఉండటంతో ఆరోజు ఉభయ సభలు సమావేశం కావు. 30న ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడుతుండగా.. జనవరి 31న రెండు సభలు సమావేశం కావని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ పేర్కొంది. ఫిబ్రవరి 1న ఆదివారం సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. తిరిగి పార్లమెంట్ ఉభయ సభలు మార్చి 9న సమావేశమై ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి.

