Budget 2026 Highlights : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు, అనగా ఫిబ్రవరి 1న, లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరతల మధ్య, భారతదేశ ఆర్థిక పునాదులను మరింత పటిష్టం చేస్తూ, వృద్ధి రేటును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది.
ఆదాయపు పన్నులో మార్పులు – మధ్యతరగతి ఆశలు
వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ బడ్జెట్ నుంచి భారీ ఉపశమనాన్ని ఆశిస్తున్నారు. గత ఏడాది పన్ను మినహాయింపు పరిమితిని రూ. 12 లక్షలకు పెంచిన ప్రభుత్వం, ఈసారి స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం.
ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న ‘సింప్లిఫైడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025’ ద్వారా పన్ను విధానాన్ని మరింత సరళీకరించి, కొత్త పన్ను విధానం (New Tax Regime) వైపు ప్రజలు మొగ్గు చూపేలా ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది.
Viral Video: పిజ్జా డెలివరీ బాయ్‌గా మారిన క్లాస్ టాపర్.. ఎగతాళి చేసిన స్నేహితురాలు!
కస్టమ్స్ డ్యూటీ , టీడీఎస్ సరళీకరణ : వ్యాపారస్తులకు , సామాన్యులకు ఊరటనిచ్చేలా కస్టమ్స్ డ్యూటీ నిర్మాణంలో భారీ మార్పులు (Re-vamp) ఉండవచ్చని అంచనా. ఇది దాదాపు జీఎస్‌టీ తరహాలోనే సరళంగా ఉండబోతోందని సమాచారం. అలాగే, టీడీఎస్ (TDS) రేట్లను తగ్గించి, ట్యాక్స్ విధానాలను సులభతరం చేసే దిశగా అడుగులు పడనున్నాయి. పన్ను వివాదాల పరిష్కారం కోసం సుమారు రూ. 1.53 లక్షల కోట్లతో కొత్త “డిస్ప్యూట్ రిజల్యూషన్ స్కీమ్”ను కూడా కేంద్రం ప్రకటించే ఛాన్స్ ఉంది.
రక్షణ , గ్రామీణాభివృద్ధికి పెద్దపీట : ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ రంగానికి నిధుల కేటాయింపు భారీగా పెరగవచ్చు. మరోవైపు, గ్రామీణ భారతంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు “వికసిత్ భారత్ – ఎంప్లాయ్‌మెంట్ అండ్ లైవ్‌లీహుడ్ మిషన్” కింద కొత్త పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డెట్-టు-జీడీపీ నిష్పత్తిని తగ్గించడం ద్వారా దేశంపై ఉన్న రుణ భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది.
- వివిధ రంగాలకు చేకూరనున్న లబ్ధి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు: 8వ పే కమిషన్ అమలుపై ఈ బడ్జెట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది జనవరి 1, 2026 నుంచి అమలు కావొచ్చని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
- ఎంఎస్ఎంఈ (MSME) , ఇతర రంగాలు: లెదర్, ఫుట్‌వేర్, రత్నాలు , ఆభరణాల రంగాలకు ప్రత్యేక సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లభించవచ్చు.
- వ్యూహాత్మక ఖనిజాలు: లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల అన్వేషణ , ప్రాసెసింగ్ కోసం అదనపు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి మేలు చేస్తుంది.
- రాష్ట్రాలకు నిధులు: 16వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు పన్నుల వాటా కేటాయింపు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా, ఈ బడ్జెట్ అటు సామాన్యుల ఆశలను, ఇటు దేశాభివృద్ధి లక్ష్యాలను బ్యాలెన్స్ చేస్తూ సాగనుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Tecno Pova Curve 2: 7750mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

