Supreme Court Judges Increases: సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/famous-producer-rb-choudhary-passes-away-in-road-accident/
ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి(CJI)తో కలిపి 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కేబినెట్ తాజా నిర్ణయంతో 38కి పెంచిన తర్వాత, సీజేఐతో కలిపి మొత్తం 38 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు, 2026’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.
పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు, న్యాయవ్యవస్థ పనితీరును మరింత బలోపేతం చేసేందుకు ఈ పెంపును చేపట్టింది. కాగా, 1956లో ఈ చట్టం వచ్చినప్పుడు న్యాయమూర్తుల సంఖ్య 10గా ఉండేది. కాలక్రమేణా కేసుల భారాన్ని బట్టి దీనిని పెంచుతూ వస్తున్నారు.

