Thursday, December 12, 2024
Homeనేషనల్One Nation One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

One Nation One Election: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల (One Nation One Election) బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ విప్‌ జారీ చేసింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

కాగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ నుంచి పంచాయతీ ఎన్నిలకు ఒకేసారి నిర్వహించాలని ప్రధాని మోదీ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధు, పార్టీలతో చర్చించి ఎన్నికల నిర్వహణపై సాధ్యసాధ్యాలను ఓ నివేదికలో రూపొందించింది. ఈ నివేదికను ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News