Wednesday, January 14, 2026
Homeనేషనల్Amit Shah in Kerala: కేరళలో అమిత్ షా పర్యటన.. కామేడ్స్ కంచుకోటలో కమల వికాసానికి...

Amit Shah in Kerala: కేరళలో అమిత్ షా పర్యటన.. కామేడ్స్ కంచుకోటలో కమల వికాసానికి అంకురార్పణ

Amit Shah Kerala visit 2026: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ పర్యటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరి 11 ఆదివారం నాడు ఆయన తిరువనంతపురంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అమిత్ షా ఈ పర్యటన వేదికగా మారబోతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

అమిత్ షా పర్యటన ఆదివారం ఉదయం చారిత్రాత్మక శ్రీ పద్మనాభస్వామి దేవాలయ సందర్శనతో ప్రారంభం కానుంది. అక్కడ షా ప్రత్యేక పూజతో దర్శనం చేసుకుంటారు. దీని తర్వాత కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రతినిధులతో సమావేశమవుతారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేయడానికి, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశం కీలకం కానుందని రాజకీయ వర్గాల్లో భారీగా చర్చ కొనసాగుతోంది. ఈ సారి కామెండ్స్ కంచుకోటలో కమలం వికాసానికి దీనిని అవకాశంగా మార్చుకోవాలని బీజేపీ అధినాయకత్వం ప్రయత్నాల్లో భాగంగా షా పర్యటన కొనసాగుతోందని వారు అంటున్నారు.

also read Bengal : రోడ్డెక్కిన దీదీ.. ఐ-ప్యాక్‌పై దాడులతో బెంగాల్‌లో ప్రకంపనలు!

పర్యటన రోజు మధ్యాహ్నం అమిత్ షా ఒక భారీ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం వేళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. కేరళలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, వామపక్ష కాంగ్రెస్ కూటములకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా సహకార రంగ మంత్రిగా కూడా ఉన్న అమిత్ షా.. కేరళలోని సహకార సంఘాల్లో జరుగుతున్న అవకతవకలను ఎండగట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి షా వ్యూహం ఎలా ఉండనుందో.

మరికొన్ని నివేదికల ప్రకారం, అమిత్ షా పర్యటనలో భాగంగా కేరళలోని ప్రముఖ సామాజిక మరియు ఆధ్యాత్మిక నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. క్రైస్తవ మత పెద్దలతో సంప్రదింపులు జరిపి, ఆ వర్గం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కూడా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమిత్ షా పర్యటనతో కేరళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News