బిహార్‌లోని గయలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi) మనవరాలు సుష్మ హత్యకు గురైంది. సుష్మను స్వయంగా ఆమె భర్తే కాల్చి చంపాడు. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందింతుడు రమేశ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -
పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా భార్యపై భర్త రమేశ్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను బలవంతంగా బంధించి ఛాతి భాగంలో కాల్చి పారిపోయాడు. దీంతో సుష్మా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.