HomeTop StoriesNirmala Sitharaman: 'దేశ ఆర్థిక సవాళ్లకు అంతర్జాతీయ పరిణామాలే కారణం'

Nirmala Sitharaman: ‘దేశ ఆర్థిక సవాళ్లకు అంతర్జాతీయ పరిణామాలే కారణం’

Nirmala Sitharaman: భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో అత్యధిక శాతం దేశం వెలుపల నుంచి ఎదురవుతున్నవేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిణామాలే మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.

- Advertisement -

అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్లే ఇబ్బందులు:  దేశంలో బంగారం, ఇంధన దిగుమతుల కోసం భారీగా విదేశీ మారకద్రవ్యం అవసరమవడమే ప్రస్తుత సవాళ్లకు ప్రధాన కారణమని మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్లే కొంత మేర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఇంధనం, బంగారం దిగుమతుల కోసం విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తుందని అన్నారు. అందుకే ప్రధాని మోదీ పొదుపు సూత్రాలను పాటించాలని కోరినట్లు.. నిర్మలా సీతారామన్ తెలిపారు.

Also read-Fuel Prices: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

కావాలనే అసత్య ప్రచారాలు: ఇదే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు కావాలనే అసత్యాలను వ్యాప్తి చేస్తున్నారని నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ.. కొందరు పనిగట్టుకుని ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News