HomeTop StoriesTamil Nadu village: పెళ్లి కాని యువత మద్యం తాగితే 5 వేలు ఫైన్.. తమిళనాడులోని...

Tamil Nadu village: పెళ్లి కాని యువత మద్యం తాగితే 5 వేలు ఫైన్.. తమిళనాడులోని ఓ గ్రామంలో వెరైటీ రూల్

Unique rule in a Tamil Nadu village: మద్యం మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు తమిళనాడులోని ఓ గ్రామ పంచాయితీ వినూత్న ఆలోచన చేసింది. నాగపట్టినం జిల్లా వేళాంగణ్ణి సమీపంలోని విళుందమావడి గ్రామ పంచాయతీ.. ‘మద్యాన్ని అరికడదాం.. ప్రజలను రక్షిద్దాం’ అనే నినాదంతో సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు ఆ గ్రామ పాలక మండలి యానర్లను సైతం ఏర్పాటు చేసింది. యువత మద్యం సేవించకూడదని, ముఖ్యంగా పెళ్లికాని యువకులు మద్యం తాగొద్దని హెచ్చరించింది. ఒకవేళ, నిబంధనలు ఉల్లంఘించి మద్యం తాగినట్టు తేలితే రూ. 5 వేల జరిమానా వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే, పెళ్లైన వారు మాత్రం తాగవచ్చని, కానీ గొడవలకు దిగకూడదని తెలిపింది. ఒకవేళ, మద్యం సేవించి గొడవలకు దిగితే వారినుంచి కూడా రూ.5వేల జరిమానా వసూలుచేస్తామని హెచ్చరించింది. ఈ వినూత్న నిర్ణయానికి గ్రామస్థులంతా సహకరించాలని కోరింది.

- Advertisement -

Also Read: DSC scam: డీఎస్సీ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కొత్త నాటకాలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News