Unnao Rape Case Delhi High Court: ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. బాధితురాలి తండ్రి కస్టడీ డెత్ కేసులో కుల్దీప్‌కు పదేళ్ల జైలు శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-switzerland-tour-attract-investments/
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టోడియల్ మృతి కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. తన 10 ఏళ్ల జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని సెంగర్ పెట్టుకున్న దరఖాస్తును జస్టిస్ రవీందర్ దుడేజా నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. సెంగర్ ఇప్పటికే సుమారు 7.5 ఏళ్ల శిక్షను అనుభవించినప్పటికీ, ఆయన అప్పీల్ విచారణలో జరుగుతున్న ఆలస్యానికి ఆయన దాఖలు చేసిన అనేక పిటిషన్లే పాక్షిక కారణమని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
Also Read: https://teluguprabha.net/health-fitness/amazing-health-benefits-of-eating-popcorn/
డయాబెటిస్, కంటి సమస్యల వంటి అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ కావాలని సెంగర్ కోరినప్పటికీ, సీబీఐ, బాధితురాలి తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతకుముందు అత్యాచార కేసులో సెంగర్‌కు డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, సుప్రీంకోర్టు డిసెంబర్ 29, 2025న ఆ ఉత్తర్వులపై స్టే విధించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కుల్దీప్.. అత్యాచార కేసులో జీవిత ఖైదును, తండ్రి మృతి కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తూ జైలులోనే ఉన్నారు.

