Saturday, November 15, 2025
HomeTop StoriesSHOCKING DEATH: 75 ఏళ్ల వృద్ధుడి పెళ్లి.. మరుసటి రోజే మృతి! 'ఆ మందే' కొంపముంచిందా?

SHOCKING DEATH: 75 ఏళ్ల వృద్ధుడి పెళ్లి.. మరుసటి రోజే మృతి! ‘ఆ మందే’ కొంపముంచిందా?

Man dies day after wedding : ముదిమి వయసులో తోడు కోసం తాపత్రయపడ్డాడు.. 75 ఏళ్ల వయసులో, తనకంటే 40 ఏళ్లు చిన్నదైన మహిళను పెళ్లాడాడు. కానీ, ఆ ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. పెళ్లైన మరుసటి రోజే, నవ వరుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, ఆ పెళ్లింట పెను విషాదం నెలకొంది. ఇది సహజ మరణమా..? లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా..? ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వింత ఘటనపై ప్రత్యేక కథనం.

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌, కుచ్‌ముచ్ గ్రామానికి చెందిన సంగ్రూ రామ్ (75) మొదటి భార్య ఏడాది క్రితం చనిపోయింది. పిల్లలు లేకపోవడంతో, ఒంటరిగా జీవిస్తున్న ఆయనకు, తోడు అవసరమని భావించిన కుటుంబ సభ్యులు, సెప్టెంబర్ 29న మన్‌భవతి (35) అనే మహిళతో ఓ ఆలయంలో వివాహం జరిపించారు.

మరుసటి రోజే మృతి.. అనుమానాల వలయం : అకస్మాత్తుగా అస్వస్థత: పెళ్లి జరిగిన మరుసటి రోజే, సంగ్రూ రామ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి, ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

బంధువుల ఆందోళన: అయితే, ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు, అంత్యక్రియలను అడ్డుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

పోస్టుమార్టం నివేదికలో ఏం తేలింది  : సంగ్రూ రామ్ మరణానికి కారణం ‘సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్’ (మెదడులో రక్తస్రావం) అని పోస్టుమార్టం నివేదికలో తేలింది. అయితే, ఈ రక్తస్రావానికి దారితీసిన కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

‘ఆ మందే’ కారణమా : ఈ ఘటనపై స్పందించిన జిల్లా సర్జన్ డాక్టర్ అరుణ్ సింగ్, ఓ కీలక అనుమానాన్ని వ్యక్తం చేశారు. “మద్యం సేవించిన తర్వాత, శృంగార సామర్థ్యం పెంచే మందులు (వయాగ్రా వంటివి) తీసుకోవడం వల్ల మెదడులో రక్తస్రావం జరిగి, ‘సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్’ సంభవించే అవకాశం ఉంది. ఆ మందు ప్రభావం, తీసుకున్న ఆరు గంటల తర్వాత కనిపిస్తుంది.” ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఆస్తి కోసమేనా ఈ పెళ్లి : సంగ్రూ రామ్, తన రెండో వివాహం కోసం ఐదు ఎకరాల భూమిని అమ్మాడని బంధువులు చెబుతున్నారు. ఆయనను వివాహం చేసుకున్న మన్‌భవతికి కూడా ఇది రెండో వివాహమని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆస్తి కోసమే ఈ పెళ్లి జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad