Thursday, April 3, 2025
Homeనేషనల్Viral video : డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్య‌క్తి మృతి

Viral video : డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్య‌క్తి మృతి

Viral video : ఇటీవ‌ల కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అప్ప‌టి వ‌ర‌కు సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వ్య‌క్తులు గుండెపోటుకు గురై ఒక్క‌సారిగా మ‌ర‌ణిస్తున్నారు. తాజాగా మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌నే పున‌రావృతమైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని వార‌ణాసిలో నవంబ‌ర్ 25(శుక్ర‌వారం) ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

మనోజ్ విశ్వకర్మ(40) అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో క‌లిసి వారణాసిలోని పిప్లాని కత్రాలో ఓ వివాహ వేడుక‌కు హ‌జ‌రయ్యారు. కుటుంబ స‌భ్యులు, బంధువులు, స‌న్నిహితులో క‌లిసి ఎంతో ఆనందంగా నృత్యం చేస్తున్నారు. అయితే.. ఒక్క‌సారిగా కాలు వ‌ణుకుత‌న్న‌ట్లు అక‌స్మాత్తుగా నేల‌పై కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించిగా అప్ప‌టికే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News