Homeనేషనల్NEET UG Re exam: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్‌పై కీలక అప్‌డేట్‌.. పరీక్ష ఎప్పుడంటే?

NEET UG Re exam: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్‌పై కీలక అప్‌డేట్‌.. పరీక్ష ఎప్పుడంటే?

Update on NEET UG Paper Re Exam: మే 3న నిర్వహించిన నీట్‌ యూజీ పేపర్ లీకేజీ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, విద్యార్థులు గందరగోళానికి గురవుతున్న తరుణంలో ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ చివరి వారంలో లేదా జులై ప్రారంభంలో ఈ పరీక్షను నిర్వహించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నీట్ పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు కుంగిపోవద్దని.. ధైర్యంగా మళ్లీ ప్రీపెర్ కావాలని అధికారులు సూచిస్తున్నారు. త్వరలోనే ఈ పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/cm-vijay-good-news-to-government-employes/

పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశం..

ఇదిలా ఉంటే, మే 3న జరిగిన పరీక్షకు ముందే ‘గెస్ పేపర్’ పేరిట క్వశ్చన్ పేపర్ లీక్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో ఎన్‌టీఏ మే 12న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ లీకేజీకి సంబంధించిన విచారణను కేంద్రం ఇప్పటికే సీబీఐకి అప్పగించింది. విచారణలో భాగంగా పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితులు ఒక్కో పేపర్‌ను రూ. 5 లక్షలకు విక్రయించినట్లు విచారణలో తేలింది. దీంతో, ఈ అక్రమాల వెనుకున్న నెట్‌వర్క్‌ను, అసలు నిందితులను గుర్తించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఇక, నీట్‌ తదుపరి షెడ్యూల్‌, ఇతర వివరాలు, తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను అనుసరించాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News