New UPI Rules: డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ పేమెంట్స్‌ను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేస్తోంది. గతంలో ప్రజలు ఏటీఎంకో లేదా బ్యాంక్‌లకు వెళ్లి డబ్బు తీసుకోవాల్సిన పరిస్థతి. చేతిలో క్యాష్ ఉంటేనే ఏదైనా కొనుగోలు చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు ప్రతీది ఆన్‌లైన్, యూపీఐ ద్వారానే కొనుగోలు చేస్తున్నాం. ఫోన్ పే, గూగుల్ పే, బీమ్, ఇతర యూపీఐ యాప్స్ ద్వారా సులభంగా మనీ పే చేస్తూ మనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. అయితే, యూపీఐ పేమెంట్లు చేసేటప్పులు తరుచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి అమౌంట్ సదరు వ్యక్తికి పంపినప్పుడు అకౌంట్ డెబిట్ అయినా అవతలి వారికి క్రెడిట్ అవ్వని పరిస్థతి. మరోసారి డెబిట్ అయిన అమౌంట్ పేమెంట్ చేసిన వ్యక్తి తిరిగి క్రికెట్ కాక ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త రూల్స్ తీసుకురానుంది. ఈ కొత్త రూల్స్ జూలై 15 నుంచి అమలు చేయనుంది.
యూపీఐ నుంచి డబ్బు పంపిన తర్వాత లావాదేవీలు ఫెయిల్ అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నూతన నిబంధనల ప్రకారం మనీ వెంటనే వినియోగదారులకు తిరిగి క్రెడిట్ అవుతుంది. పొరపాటున తప్పు యూపీఐ నంబరుకు పంపిన అమౌంట్‌ను కూడా తిరిగి పొందొచ్చు. ఛార్జ్‌బ్యాక్‌లను బ్యాంకులు స్వయంగా సేకరించే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు లావాదేవీల సమయం కూడా తగ్గించారు.
ALSO READ: https://teluguprabha.net/news/telangana-government-clears-medical-dues-for-govt-employees-check-details-here/
యూపీఐ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు డెబిట్ అయిన తర్వాత ట్రాన్స్‌యాక్షన్ ఫెయిల్ అయినా ఆ డబ్బు వెంటనే తిరిగి పొందవచ్చు. జూలై 15 నుంచి NPCI కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, ఖాతా నుంచి అమౌంట్ డెబిట్ అయిన తర్వాత చెల్లింపు పూర్తి కాకపోతే వినియోగదారుకు వెంటనే రిటర్న్ అవుతుంది. ఇదే కాకుండా తప్పు యూపీఐ నంబర్‌కు మనీ పంపిన సందర్భంలో కూడా వినియోగదారుడు రిసీవర్ బ్యాంక్ నుంచి తిరిగి సదరు అమౌంట్‌ను పొందే అవకాశం కల్పించింది.
నూతన మార్గదర్శకాలను అనుసరించి బ్యాంకులు ఇప్పుడు ఎన్‌పీసీఐ(NPCI) నుంచి ముందస్తు అనుమతి అవసరం లేకుండానే తిరస్కరించబడిన ఛార్జ్‌బ్యాక్‌లను స్వయంగా సేకరించనున్నాయి. NPCI తీసుకురానున్న కొత్త యూపీఐ ఛార్జ్‌బ్యాక్ వ్యవస్థ, గతంలో తిరస్కరించబడిన రీఫండ్ క్లెయిమ్‌లకు ఉపశమనం కలుగనుంది. నూతన రూల్స్ ప్రకారం గతంలో తిరస్కరించబడిన కేసులను తిరిగి దర్యాప్తు చేసి, వాటిని పరిష్కరించే అధికారం బ్యాంకులకు ఉంటుంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/legendary-singer-k-s-chitra-shares-about-her-shoulder-injury/
యూపీఐ ద్వారా చెల్లింపు పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసింది. గతంలో చెల్లింపులకు 30 సెకండ్ల టైం ఉండేది. అయితే, ఇప్పుడు చెల్లింపులు 15 సెకండ్ల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నియయాన్ని NPCI ఈనెల 15 నుంచి నుంచి అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మే నెలలో, ఎన్‌పీసీఐ బ్యాంకులు, చెల్లింపు యాప్‌లను వాటి సంబంధిత వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించిన సంగతి విధితమే. ఈమేరకు ట్రాన్సాక్షన్ 15 సెకెండ్లలోనే కంప్లీట్ కానుంది.
కాగా, విఫలమైన లావాదేవీని రివర్స్ చేయడానికి పట్టే టైమింగ్స్‌లోనూ మార్పులు తీసుకొచ్చారు. గతంలో ట్రాన్సఫర్ అవ్వకపోతే మనీ డెబిట్ అయ్యిందా లేదా తిరిగి క్రెడిట్ అయ్యిందా అని చెక్ చేయడానికి యూజర్స్ 30 సెకండ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థతి ఉండేది. కానీ ప్రస్తుతం లావాదేవీ స్థితిని తనిఖీ చేసే ప్రక్రియ కూడా కేవలం టెన్ సెకండ్స్ మాత్రమే పట్టనుంది. దీంతో ట్రాన్సాక్సన్ ఫెయిల్ ఆర్ సక్సెస్ అయ్యిందని తెలుసుకోడానికి మరింత ఈజీ కానుంది.
UPI New Rules: జూలై 15 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్
- Advertisement -