Monday, December 23, 2024
Homeకెరీర్UPSC: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీలు ప్రకటన

UPSC: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీలు ప్రకటన

సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థుల రోల్ నెంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచింది. త్వరలోనే ఈ-సమన్ లెటర్లు పొందుపరచనున్నట్టు పేర్కొంది.

- Advertisement -

ఈ ఏడాది 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు UPSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీలలో మెయిన్ పరీక్షలు నిర్వహించగా.. డిసెంబర్ 9న ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 2,845 మంది అభ్యర్థులు తదుపరి దశకు ఎంపికయ్యారు. వీరిని ఇంటర్వ్యూ చేసి వివిధ సర్వీసులకు ఎంపిక చేస్తారు. కాగా గత ఏడాది తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 60 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News