Friday, September 20, 2024
Homeనేషనల్Most Wanted List : ఇదో విచిత్ర ఘ‌ట‌న‌.. ఇగోకి పోయాడు.. ఇరుక్కుపోయాడు

Most Wanted List : ఇదో విచిత్ర ఘ‌ట‌న‌.. ఇగోకి పోయాడు.. ఇరుక్కుపోయాడు

Most Wanted List : త‌న గొయ్యిని తానే త‌వ్వుకున్నాడ‌ట అనే సామెత తెలిసిందే. ఈ దొంగ‌ను చూస్తే అది నిజం అనిపించ‌క‌మాన‌దు. నేరాలు చేసి పోలీసుల క‌ళ్లు గ‌ప్పి తిరుగుతున్న ఓ దొంగ ఇగోకి పోయాడు. పోలీసులు రూపొందించిన మోస్ట్ వాండేట్ లిస్ట్‌లో త‌న పేరులేక‌పోవ‌డంతో ఫీలైన‌ట్లు ఉన్నాడు. సోష‌ల్ మీడియాలో క‌నిపించిన ఆ పోస్టులో ‘నా సంగ‌తి ఏంటీ’ అంటూ కామెంట్ చేశాడు. మ‌రీ పోలీసులు ఊరుకుంటారా..? తీసుకువ‌చ్చి బొక్క‌లో ప‌డేశారు. ఈ ఘ‌ట‌న అమెరికాలో జ‌రిగింది.

- Advertisement -

అమెరికాలోని జార్జియాలో రాక్‌డేల్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్‌ అధికారులు హ‌త్య‌లు,సాయుధ దోపిడి, కిడ్నాప్ వంటి తీవ్ర‌మైన‌ నేరాల‌కు పాల్ప‌డిన వ్య‌క్తుల జాబితాతో టాప్‌-10 మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్స్ జాబితాను రూపొందించారు. ఈ జాబితాను అన్ని సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాంల‌లో పోస్ట్ చేశారు. ఫేస్‌బుక్‌లో ఈ జాబితాను క్రిస్టోఫర్ స్పాల్డింగ్ అనే నేర‌స్థుడు చూశాడు.

ఆ జాబితాలో త‌న పేరును లేక‌పోవ‌డాన్ని గుర్తించాడు. అందులో అత‌డి పేరు లేక‌పోవ‌డాన్ని చిన్న‌తనంగా బావించాడో ఏమో తెలీదు గానీ వెంట‌నే ఆ పోస్ట్ కింద మ‌రి నా సంగ‌తి ఏంటీ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై పోలీసులు స్పందించాడు. ‘నీవు చెప్పింది నిజ‌మే. నీ మీదా రెండు వారెంట్లు ఉన్నాయి. మేము వ‌స్తున్నాం’ అని అత‌డికి రిప్లై ఇచ్చాడు. మ‌రుస‌టి రోజు క‌ల్లా అత‌డిని అరెస్ట్ చేశారు.

‘నిన్ను ప‌ట్టుకోవ‌డంతో నీ స‌హాయాన్ని అభినందిస్తున్నాం’ అని పోలీసులు క్రిస్టోఫర్ స్పాల్డింగ్ ఫోటోను పోస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో పేరు లేనంత మాత్రాన‌ నిన్ను వెత‌క‌మ‌ని అర్థం కాదు అంటూ కాస్త వ్యంగ్యంగానే రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. నీ గొయ్యి నువ్వే త‌వ్వుకున్నావుగా అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా, ఇటీవ‌ల నేను చూసిన అత్యంత ఫ‌న్నీ ఇన్సిడెంట్ ఇదే అంటూ మ‌రో యూజ‌ర్ చెప్పాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News