తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంపీ సురేష్ షెట్కార్‌తో కలిసి నాందేడ్‌లోని 400 సంవత్సరాల పురాతనమైన సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారా(Gurudwara)ను సందర్శించారు. అనంతరం అక్కడ ప్రార్థనలు చేశారు. ఆయనకు గురుద్వార్ అధికారులతో పాటు, స్థానిక కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
- Advertisement -
కాగా సిక్కుల చివరి గురువు అయిన గురుగోవింద్ సింగ్ ఈ ప్రాంతంలో మరణించారు. దీంతో సిక్కులను దీనిని అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు. గురుద్వారాను మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారు.