‘Life Imprisonment’ For Stray Dogs Who Bite Humans Twice: వీధి కుక్కల బెడద తగ్గించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. మనుషులను ఎటువంటి కవ్వింపు లేకుండా రెండు సార్లు కరిచిన వీధి కుక్కలకు ‘యావజ్జీవ శిక్ష’ విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నియమం ప్రకారం, రెండు సార్లు కరిచిన కుక్కలను జీవితాంతం ప్రభుత్వ జంతు సంరక్షణ కేంద్రంలోనే ఉంచుతారు.
సెప్టెంబర్ 10న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజాత్ అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ వీధి కుక్క కరిచి ఎవరైనా యాంటీ-రాబీస్ వ్యాక్సిన్ తీసుకుంటే, ఆ ఘటనపై దర్యాప్తు చేసి కుక్కను సమీపంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌కు తరలిస్తారు.
“జంతు సంరక్షణ కేంద్రానికి చేరిన తర్వాత, కుక్కకు ఇంకా స్టెరిలైజేషన్ చేయకపోతే ఆ ప్రక్రియ పూర్తి చేసి, 10 రోజుల పాటు దాని ప్రవర్తనను పరిశీలిస్తారు. తర్వాత దానికి మైక్రోచిప్ అమర్చి తిరిగి వదిలేస్తారు. ఈ మైక్రోచిప్‌లో కుక్కకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి, ఇది దాని లొకేషన్‌ను గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది,” అని ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ పశువైద్యాధికారి డాక్టర్ బిజాయ్ అమృత్ రాజ్ తెలిపారు.
ALSO READ: SUPREME COURT : బిహార్ ఓటర్ల జాబితా రగడ.. “అక్రమాలు తేలితే రద్దు చేస్తాం!”
అయితే, అదే కుక్క ఎటువంటి కవ్వింపు లేకుండా మళ్ళీ మనిషిని కరిస్తే, దానిని జీవితాంతం జంతు సంరక్షణ కేంద్రంలోనే ఉంచుతారు. కవ్వింపు ఉందా లేదా అని నిర్ధారించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక పశువైద్యుడు, జంతువుల ప్రవర్తన తెలిసిన వ్యక్తి, మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఉంటారు. ఎవరైనా రాయి విసిరిన తర్వాత కుక్క కరిస్తే అది కవ్వింపు చర్య కిందకు రాదని కమిటీ నిర్ధారిస్తుంది.
ఈ కొత్త ఆదేశాల ప్రకారం, జంతు సంరక్షణ కేంద్రంలోని కుక్కలను ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అయితే, దత్తత తీసుకునే వ్యక్తి తమ పూర్తి వివరాలను ఇచ్చి, ఆ కుక్కను మళ్లీ వీధుల్లోకి వదలమని అఫిడవిట్ సమర్పించాలి. ఒకవేళ ఆ కుక్కను మళ్లీ వీధుల్లో వదిలేస్తే, దత్తత తీసుకున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ నిర్ణయం వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ALSO READ: Madhya Pradesh Sidhi Murder : బేస్‌బాల్ బ్యాట్‌తో మహిళా హెడ్ కానిస్టేబుల్ ను కొట్టి చంపిన భర్త


