Saturday, November 15, 2025
Homeనేషనల్Vande Bharat : వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. రైలు కదిలే 15 నిమిషాల ముందు...

Vande Bharat : వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. రైలు కదిలే 15 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు!

Vande Bharat last-minute booking : అప్పటికప్పుడు ప్రయాణం ఖరారైందా? వందే భారత్ రైలు ఎక్కాలనుకుంటున్నారా? టికెట్ దొరుకుతుందో లేదోనన్న ఆందోళన ఇక అక్కర్లేదు! భారతీయ రైల్వే వందే భారత్ ప్రయాణికులకు ఓ అద్భుతమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రైలు స్టేషన్ నుంచి కదిలేందుకు కేవలం 15 నిమిషాల ముందు కూడా మీరు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఏయే రైళ్లకు వర్తిస్తుంది..? దీనివల్ల ప్రయాణికులకు కలిగే ప్రయోజనమేంటి..?

- Advertisement -

చివరి నిమిషంలో ప్రయాణాలు చేసేవారికి ఊరట కల్పిస్తూ, రైళ్లలో సీట్ల లభ్యతను గరిష్ఠంగా వినియోగించుకునే లక్ష్యంతో దక్షిణ రైల్వే ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ (PRS)ను ఆధునికీకరించి, ఈ కొత్త సదుపాయానికి శ్రీకారం చుట్టింది.

ఎందుకీ నిర్ణయం : చాలా సందర్భాల్లో రైలు ప్రారంభ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత, మధ్యలోని స్టేషన్లలో ఎక్కాల్సిన ప్రయాణికుల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ ఖాళీలను చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునే వారికి కేటాయించడం ద్వారా రైల్వేకు ఆదాయం, ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుంది. ఈ రెండు లక్ష్యాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏయే రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది : ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దక్షిణ రైల్వే జోన్ పరిధిలోని ఎనిమిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైలు కూడా ఉంది.

20677: డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ – విజయవాడ
20631: మంగళూరు సెంట్రల్ – తిరువనంతపురం సెంట్రల్
20632: తిరువనంతపురం సెంట్రల్ – మంగళూరు సెంట్రల్
20627: చెన్నై ఎగ్మోర్ – నాగర్‌కోయిల్
20628: నాగర్‌కోయిల్ – చెన్నై ఎగ్మోర్
20642: కోయంబత్తూర్ – బెంగళూరు కాంట్.
20646: మంగళూరు సెంట్రల్ – మడ్గావ్
20671: మధురై – బెంగళూరు కాంట్.

ఈ రైళ్లలో మార్గమధ్యంలోని స్టేషన్ల నుంచి ఎక్కే ప్రయాణికులు కూడా ఈ చివరి నిమిషం బుకింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి : ఈ చివరి నిమిషం టికెట్ బుకింగ్ ప్రక్రియ చాలా సులభం. సాధారణ టికెట్ బుకింగ్ పద్ధతిలోనే దీన్ని కూడా చేసుకోవచ్చు.

స్టెప్ 1: IRCTC అధికారిక వెబ్‌సైట్ (www.irctc.co.in) లేదా ‘IRCTC రైల్ కనెక్ట్’ మొబైల్ యాప్‌ను తెరవండి.

స్టెప్ 2: మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

స్టెప్ 3: మీరు ఎక్కాలనుకుంటున్న స్టేషన్ (బోర్డింగ్), గమ్యస్థానం, ప్రయాణ తేదీని ఎంచుకుని, రైళ్ల జాబితాలో వందే భారత్ రైలును ఎంచుకోండి.

స్టెప్ 4: సీట్ల లభ్యతను తనిఖీ చేయండి. సిస్టమ్ ఆ సమయంలో ఉన్న ఖాళీ సీట్లను (రియల్-టైమ్) చూపిస్తుంది.

స్టెప్ 5: మీకు కావాల్సిన క్లాస్ (ఎగ్జిక్యూటివ్ క్లాస్ లేదా చైర్ కార్) ఎంచుకుని, ప్రయాణికుల వివరాలు నమోదు చేయండి.

స్టెప్ 6: డిజిటల్ పద్ధతుల్లో (UPI, క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్) చెల్లింపు పూర్తి చేయండి. తక్షణమే మీ ఇ-టికెట్ SMS, ఈ-మెయిల్ ద్వారా మీకు అందుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad