Thursday, September 19, 2024
Homeనేషనల్vandebharat: మూడు వందేభార‌త్ రైళ్లను ప్రారంభించిన ప్ర‌ధాన మోదీ

vandebharat: మూడు వందేభార‌త్ రైళ్లను ప్రారంభించిన ప్ర‌ధాన మోదీ

ల‌క్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ‌నివారం మూడు కొత్త వందేభారత్ రైళ్లను వ‌ర్చువ‌ల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ మూడు కొత్త వందే భారత్ రైళ్లు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని ప‌లు ప్రాంతాలను కలుపుతాయి. వీటిలో మొదటి వందే భారత్ రైలు చెన్నై సెంట్రల్ నుండి నాగర్‌కోయిల్‌కు, రెండవది మదురై నుండి బెంగళూరు కాంట్‌కు, మూడవది మీరట్ సిటీ-లక్నో మ‌ధ్య న‌డుస్తుంది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుండి, ఈ రైళ్లు నడిచే ప్రతిచోటా పర్యాటకం పెరిగింద‌న్నారు. ఇది స్థానిక వ్యాపారాలను పెంచింది. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించింది. ఇంత‌టి విజయాన్నిచ్చిన‌ పౌరులను అభినందిస్తున్నానని అన్నారు. కర్ణాటకలోని మధురైలో వైగై నదిపై వంతెనపై నుంచి కొత్త వందే భారత్ రైలు వెళుతుంది. ఈ మదురై – బెంగళూరు వందే భారత్ రైలు కాషాయ‌ రంగులో ఉంది. ఈరోజు ప్రారంభ‌మైన మీరట్-లక్నో మార్గంలో న‌డిచే వందే భారత్ రైలు పశ్చిమ యూపీ ప్రజలకు వ‌రంలాంటిద‌ని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మీరట్- పశ్చిమ యూపీ విప్లవ భూములు. నేడు ఈ ప్రాంతం అభివృద్ధిలో కొత్త విప్లవానికి సాక్షిగా నిలుస్తోంది. వందే భారత్ ఆధునిక భారతీయ రైల్వేలకు కొత్త ముఖంలాంటిది. నేడు ప్రతి రూట్‌లో వందేభారత్‌కు డిమాండ్‌ ఉందని మోదీ పేర్కొన్నారు. హై-స్పీడ్ రైళ్ల రాకతో ప్రజలు తమ వ్యాపారం, ఉపాధితోపాటు వారి కలలను సాకారం చేసుకున్నార‌న్నారు. నేడు దేశవ్యాప్తంగా 102 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ‘అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని చేరుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన అభివృద్ధి చాలా ముఖ్యమ‌ని మోదీ అన్నారు. దక్షిణ భారతదేశంలో అపారమైన ప్రతిభ, అపారమైన వనరులు, అవకాశాలు ఉన్నాయి. అందుకే తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం దక్షిణాది అభివృద్ధే మా ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News