Saturday, November 15, 2025
Homeనేషనల్Rahul Gandhi: సిక్కులపై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ విచారణకు కోర్టు అంగీకారం

Rahul Gandhi: సిక్కులపై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ విచారణకు కోర్టు అంగీకారం

Rahul Gandhi statement on Sikhs: సిక్కులను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది చేసిన వ్యాఖ్యల పట్ల విచారణకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అంగీకరించింది. రాహుల్ వ్యాఖ్యలు విద్వేషపూరితమైనవి అంటూ అడ్వొకేట్ వివేక్ శంకర్ తివారీ ఈ పిటిషన్‌ని దాఖలు చేశారు.

- Advertisement -

అమెరికా పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ గతేడాది సెప్టెంబర్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం తెలుపుతూ అడ్వొకేట్ వివేక్ శంకర్ తివారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని అదే ఏడాది నవంబర్‌లో తిరస్కరించింది. దీంతో ఆయన మరోసారి వారణాసిలోని సెషన్స్ కోర్టులో రివిషన్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణకు కోర్టు సోమవారం అంగీకరించింది.

రాహుల్ ఏమన్నారు?

“భారత్‌లో సిక్కులు ధైర్యంగా తలపాగా ధరించగలరా? తమ మతాన్ని ఎలాంటి బెరుకు లేకుండా ఆచరించగలరా?” అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎలా ఉండాలనేది కేవలం ఒక వర్గం వారు మాత్రమే నిర్ణయిస్తున్నారు అంటూ రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల పట్ల గతంలో వివాదం చెలరేగింది. అయితే తన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ వక్రీకరిస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన మతాన్ని ఆచరించగలిగేలా భారతదేశం ఉండాలని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad