TVK Vijay VCK Support: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీకి విదుతలై చిరుతైగల్ కట్చి(VCK) ఈరోజు అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వీసీకే నేత తిరుమావళవన్.. టీవీకే పార్టీ నేత ఆదవ అర్జునకు మద్దతు తెలుపుతూ అధికారిక లేఖను అందజేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/vck-party-in-tamilnadu-politics/
వీసీకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ కూటమి సంఖ్యా బలం 118కి చేరింది. ఇది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్. కాగా, ఇప్పటికే టీవీకే పార్టీకి కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2) పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. వీసీకే శుక్రవారమే మద్దతు తెలిపినా.. అధికారిక ప్రకటనలో జాప్యం నెలకొనడంతో ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు ఈ ప్రకటనతో విజయ్‌కి అడ్డంగులు తొలిగాయి.

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-plans-to-make-hyderabad-a-signal-free-city/
మే 4న వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే(108) అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే విజయ్ రెండు చోట్లా గెలవడంతో సంఖ్యాబలం 107కి చేరింది. ఈ క్రమంలో స్పష్టమైన మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోవడంతో ఇతర పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు వీసీకే కార్యాలయానికి విజయ్ బయలుదేరారు. మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు.

