Homeనేషనల్VCK Party Key Comments: విజయ్‌కు మద్దతివ్వాలా? వద్దా?.. రేపు చెబుతామన్న వీసీకే పార్టీ

VCK Party Key Comments: విజయ్‌కు మద్దతివ్వాలా? వద్దా?.. రేపు చెబుతామన్న వీసీకే పార్టీ

VCK Party Key Comments on support to Vijay TVk: సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగుతున్న తమిళనాడు పాలిటిక్స్‌లో మరో బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. మ్యాజిక్‌ ఫిగర్‌కు కొద్ది దూరంలో ఆగిపోయిన విజయ్‌.. కలిసివచ్చే పార్టీలను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు మద్దతివ్వాలంటూ వీసీకే పార్టీకి ఆయన లేఖ రాయగా.. ఆ పార్టీ కొద్ది సేపటి క్రితమే కీలక ప్రకటన చేసింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలా? వద్దా? అనే అంశంపై శుక్రవారం సాయంత్రం పార్టీ ఉన్నత స్థాయి కమిటీ చర్చలు జరపనున్నట్లు వీసీకే చీఫ్‌ తిరుమావళవన్ తెలిపారు. పార్టీలోని అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రేపు (శనివారం) మీడియా సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. టీవీకేతో పొత్తుపై తాము కావాలనే ఆలస్యం చేస్తున్నామని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఫలితాలు మే 4వ తేదీనే ప్రకటించారని.. నాలుగు రోజుల్లో నిర్ణయం చెప్పకపోవడం ఆలస్యమేమీ కాదన్నారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/tvk-vijay-tweet-on-inter-results/

వాట్సాప్‌లో మద్దతు కోరడమేంటి?

ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అగ్రశ్రేణి నాయకులతో సంప్రదించి.. వారి అభిప్రాయాలు తీసుకోవడం తమ బాధ్యత అని తిరుమావళవన్ స్పష్టం చేశారు. మరోవైపు, వీసీకే ప్రధాన కార్యదర్శి సింథనై సెల్వన్ టీవీకే పార్టీ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీ లేని సమయంలో విజయ్‌ స్వయంగా ఇతర పార్టీ నేతలను కలిసి మద్దతు కోరగా.. మా విషయంలో నేరుగా కలవకుండా.. వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టడం సరైన చర్య కాదన్నారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఆ పార్టీలోని కొందరు నేతలు అహంకారం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. గతంలో వంశపారంపర్య రాజకీయాలపై విమర్శలు చేసి.. ఇప్పుడు అలాంటి పార్టీలతోనే టీవీకే పొత్తు పెట్టుకుంటోందని పరోక్షంగా కాంగ్రెస్‌తో జతకట్టడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో వీసీకే పార్టీ రెండు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఈ రెండు సీట్లు కీలకం కానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News