“ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండలో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైనిక్ స్కూల్ ను గురువారం నేను సందర్శించాను. పచ్చటి పరిసరాల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుతీరిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా బోధన అందించడం సంతోషకరం. కెప్టెన్ ఎస్ ఎస్ శాస్త్రి గారి తో కలిసి పాఠశాలలోని అన్ని విభాగాలను సందర్శించాను. విద్యార్థులతో ముచ్చటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో ప్రస్ఫుటమవుతున్న దేశభక్తి, వారిలో కనిపిస్తున్న క్రమశిక్షణ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. భవిష్యత్తులో భారత సైన్యంలో చేరి సేవలందించాలనుకునే విద్యార్థులకు ఇక్కడ అందిస్తున్న శిక్షణ అత్యుత్తమం” అంటూ వెంకయ్య పేర్కొన్నారు.