Sunday, November 16, 2025
Homeనేషనల్No Salary fir Vice President: జీతం లేని ఉపరాష్ట్రపతి పదవి

No Salary fir Vice President: జీతం లేని ఉపరాష్ట్రపతి పదవి

Vice President Election: మనదేశంలో అత్యుత్తమ పదవుల్లో ఒకటైన రాష్ట్రపతి పదవికి రాజ్యాంగబద్ధంగా చాలా విలువ ఉంది. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవి తర్వాత ఉప రాష్ట్రపతి పదవే అత్యుత్తమమైనది. అయితే సూత్రప్రాయంగా, ఉపరాష్ట్రపతి పదవికి జీత భత్యాలు అనే నిబంధనలు ప్రత్యేకించి లేదు. కానీ ఆయనకు నెలనెలకు గౌరవ వేతనంతోపాటు అదనపు భత్యాలు అందుతాయి.అదేలా అంటే ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చునే వారే పెద్దల సభ అయిన రాజసభ్యకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలోనే ఉపరాష్ట్రపతికి గౌరవ వేతనం, ఇతర భత్యాలు చెల్లిస్తారు.

- Advertisement -

జీతం ఎంత?

ఉపరాష్ట్రపతి “రాజ్యసభ చైర్మన్ ” హోదాలో పనిచేస్తున్న సమయానికి నెలకు రూ.4 లక్షల జీతం అందుతుంది. ఇది 2018కు ముందు రూ. 1.25 లక్షలుగా ఉండేది. జీతంతోపాటు ఉచిత వసతి, మెడికల్ ఫెసిలిటీ, రైలు, విమానాల్లో ప్రయాణం, సిబ్బంది, వ్యక్తిగత భద్రత, మొబైల్, ల్యాండ్ ఫోన్ బిల్లుల చెల్లింపులు వంటి అదనపు సౌకర్యాలు అందుతాయి. వైద్య సదుపాయాలు ఉపరాష్ట్రపతితో పాటు అతడు/ఆమె కుటుంబ సభ్యులకు కూడా అందుతాయి.

రూ.2 లక్షల పెన్షన్
ఉపరాష్ర్టపతి పదవి నుంచి రిటైరయ్యాక ఇప్పుడందుతున్న జీతంలో నుంచి సగం అంటే రూ.2 లక్షలు నెలవారీగా పెన్షన్ అందుతుంది. ఢిల్లీలో బంగళా , వ్యక్తిగత కార్యదర్శి, అదనపు వ్యక్తిగత కార్యదర్శి, డాక్టర్, నర్సింగ్ ఆఫీసర్, నలుగురు వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. ఒకవేళ ఉపరాష్ట్రపతి రిటైరయ్యాక మరణిస్తే ఆయన భార్య/ ఆమె భర్తకు జీవితాంత ప్రభుత్వ ఖర్చులతో ఇల్లు కేటాయిస్తారు.

కార్యాలయ నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తారు.

అయితే రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ గతంలో రాజస్థాన్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పని చేశారు. దీంతో ఆయన మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చే పెన్షన్ కోసం అప్లయ్ చేసుకున్నారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యేల కోటాలో నెలావారీ పెన్షన్ అందనుంది.

ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష ఇండి కూటమి తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిలు బరిలో ఉన్నారు. ఎన్డీయేకు 425 మంది సభ్యులు, ప్రతిపక్ష ఇండియా కూటమికి 311 మంది సభ్యుల బలం ఉంది. ఈ రెండు పక్షాలలో సభ్యులుగా లేనివారు ఎవరికి ఓటేస్తారో ఆసక్తిగా మారింది. కాగా ఈసారి ఉపరాష్ట్రపతిగా బరిలో ఉన్న ఇద్దరూ దక్షిణ భారతదేశానికి సంబంధించి వారే కావడం విశేషం. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారుకాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వాసి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad