Sunday, October 6, 2024
Homeనేషనల్Brave Delhi Cop : ప్రాణాల‌కు తెగించి దొంగ‌ను ప‌ట్టుకున్న ఢిల్లీ పోలీస్‌

Brave Delhi Cop : ప్రాణాల‌కు తెగించి దొంగ‌ను ప‌ట్టుకున్న ఢిల్లీ పోలీస్‌

త‌న ప్రాణాల్ని సైతం లెక్క‌చేయ‌కుండా దొంగ‌ను ప‌ట్టుకున్న ఓ ఢిల్లీ ఫోలీస్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ పోలీస్ చూపించిన తెగువ‌ను అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

- Advertisement -

ఢిల్లీలోని షాహాబాద్ డెయిరీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ మ‌హిళ మెడ‌లో గొలుసు చోరికి గురైంద‌న్న స‌మాచారం అందుకున్నాడు కానిస్టేబుల్ స‌త్యేంద్ర. క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా ఆ దొంగను వెత‌కడం ప్రారంభించాడు. ఓ దారిలో ఆ దొంగ వెలుతున్నాడు అని తెలుసుకుని అత‌డికి ఎదురుగా బైక్‌పై కానిస్టేబుల్ వ‌చ్చాడు.

కానిస్టేబుల్ స‌త్యేంద్ర‌ను చూసిన దొంగ బైక్ ఆప‌కుండా ముందుకు వెళ్ల‌బోయాడు. వెంట‌నే త‌న బైక్ పై నుంచి దొంగ పైకి దూకాడు కానిస్టేబుల్‌. దొంగ పారిపోయేందుకు ఎంత‌గా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి వ‌ద‌ల‌కుండా గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. చివ‌రికి అత‌డిని అరెస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన 19 సెకన్ల వీడియోను ఢిల్లీ పోలీసులు త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక్కడ ఇంకో విష‌యం ఏమిటంటే.. ఆ కానిస్టేబుల్ ప‌ట్టుకుంది మామూలు దొంగ‌ను కాదంట‌. అత‌డికి చాలా నేర చ‌రిత్ర ఉంద‌ని, అత‌డిని ప‌ట్టుకోవ‌డంతో 11 కేసులు ప‌రిష్కారం అయిన‌ట్లు ఆ ట్వీట్‌లో ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఆ కానిస్టేబుల్ పై నెటీజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News